'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'
KRNL: జిల్లాలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం తుఫాన్, అధిక వర్షాల వల్ల మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2400 ఉండగా, మార్కెట్లో తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.