'ది హండ్రెడ్' వేలం.. టాప్ ప్లేయర్లు వీరే
ఇంగ్లండ్ 'ది హండ్రెడ్ లీగ్' వేలంలో సోఫీ డివైన్, బెథ్ మూనీకి రికార్డ్ ధర లభించింది. సోఫీని వెల్ష్ ఫైర్ రూ.2.59 కోట్లకు కొనుగోలు చేయగా.. అంతే మొత్తానికి మూనీని ట్రెంట్ రాకెట్స్ దక్కించుకుంది. అత్యధిక ధర పలికిన ప్లేయర్ల లిస్టులో డానీ గిబ్సన్(రూ.2.34 కోట్లకు సన్‌రైజర్స్ లీడ్స్), నడిన్ డి క్లెర్క్(రూ.2.09 కోట్లకు లండన్ స్పిరిట్) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నారు.