రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి సీతక్క

KMR: దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో కోటి 15లక్షల కుటుంబాలకు గాను 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ చందర్ రాథోడ్ పాల్గొన్నారు.