కష్టపడిన వారికే పార్టీలో గుర్తింపు: మంత్రి

కష్టపడిన వారికే పార్టీలో గుర్తింపు: మంత్రి

NLR: కష్టపడి పని చేసిన కార్యకర్తలకు TDPలో గుర్తింపు ఉంటుందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. చింతారెడ్డిపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్ల ఇంఛార్జ్‌తో ఆయన సమీక్షించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ వారికి దిశా నిర్దేశం చేశారు.