రైలు కిందపడి మహిళ మృతి

రైలు కిందపడి మహిళ మృతి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ చెప్పినదాని ప్రకారం శుక్రవారం వెంకటాయపల్లి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద గద్దె గూడెం గ్రామానికి చెందిన లక్ష్మీ (48) మతిస్థిమితం సరిగా లేక.. రైలు కింద పడి మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.