మధుసూదన్ కుటుంబానికి వైసీపీ రూ.5 లక్షల సాయం

NLR: పహల్గాం ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి వైసీపీ రూ.5 లక్షల సాయం అందజేసింది. ఎమ్మెల్సీ మేరిగ మురళి, కావలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.