రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: నిర్మల్ మండలం అక్కాపూర్ గ్రామ శివారులోని 220KV సబ్ స్టేషన్ కెపాసిటర్ బ్యాంక్ మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ నాగరాజు శుక్రవారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు నిర్మల్ మున్సిపాలిటీ, లక్ష్మణచాంద, నిర్మల్ రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ తెలిపారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.