నూతన సర్పంచ్ ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే
హన్మకొండ జిల్లా జిల్లా హాసన్ పర్తి మండలం మడిపెల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన బుర్ర రంజిత్‌ను ఇవాళ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఘనంగా సన్మానించారు. ఇవాళ అరురిని వారు మర్యాదపూర్వకంగా కలవగా ఆయన నూతన సర్పంచ్‌ను సన్మానించి పలు సూచనలు చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలలో భాగస్వామ్యం పంచుకోవాలని సూచించారు.