గీసుగొండలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

గీసుగొండలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

WGL: గీసుగొండ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీని నేడు చేపట్టారు. కొనాయిమాకుల నుంచి గీసుగొండ అంబేడ్కర్ సెంటర్ వరకు స్థానిక నాయకులు ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు కాషాయ కండువాలు ధరించి, జాతీయ జెండాలు పట్టుకొని, దేశభక్తి నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని వారు పిలుపునిచ్చారు.