శ్రీరామయ్య తండ్రి సంబరాల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే

SKLM: లావేరు మండలం లక్ష్మీపురంలో శ్రీ రామయ్య తండ్రి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. మాజీ ఎంపీటీసీ బోర పార్వతి ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.