పీజీ కళాశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన

WNP: మండలంలోని నాలుగో వార్డు నర్సింగయ్య పల్లిలోని పీయూ అనుబంధ పీజీ కళాశాలకు రూ.కోటి 20లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఓం శాంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.