పీ-4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
కృష్ణా: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీ-4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా, సమాజంలోని పేద ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే పీ-4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పేద వర్గాలకు మేలు చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.