నేడు, రేపు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలకు సెలవు
BDK: దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేటలో గల రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలకు వరుసగా రెండు రోజులు పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వారం రోజులు ఫ్యాక్టరీలకు ఆయిల్ పామ్ గెలలు అధికంగా వచ్చాయని అన్నారు. ఈ కారణంగా బుధవారం, గురువారం గెలలు కొనబోమని పేర్కొన్నారు.