'పండించిన ప్రతి రైతు నష్టపోకూడదు'

'పండించిన ప్రతి రైతు నష్టపోకూడదు'

ప్రకాశం: తర్లుపాడులో బుధవారం కందులు, శనగలు కొనుగోలు కేంద్రాన్ని జనసేన ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ ప్రారంభించారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం క్వింటాకు రూ. 450 పెంచిందని, దళారి వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. పండించిన ప్రతి రైతు నష్టపోకూడదని, రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.