వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నేకూరి

వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నేకూరి

ELR: జంగారెడ్డిగూడెం వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నేకూరి కిషోర్ శుక్రవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 2019 ఎన్నికల్లో 6వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసిన ఆయన 660 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, టౌన్‌లో అత్యధిక మెజారిటీ సాధించిన వైసీపీ అభ్యర్థిగా నిలిచారు.