అక్రమ చోరబాట్లు అడ్డుకుంటాం: మంత్రి స్వామి
ప్రకాశం: కడలూరు బోట్ల అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శనివారం టంగుటూరులో జరిగిన మత్స్యకారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మత్స్యకారులకు వేట నిషేధిత భృతి ప్రభుత్వం రూ.20 వేలు పెంచిన విషయాన్ని వారికి గుర్తు చేశారు.