రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 26, 27న శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.