విషాదం.. MBBS విద్యార్థి ఆత్మహత్య
AP: నెల్లూరులోని ACSR ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విషాదం నెలకొంది. హాస్టల్ గదిలో ఉరేసుకుని నాగ మహేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను MBBS మూడో సంవత్సరం చదువుతున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.