కాళ్లు పట్టుకోవడానికే హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు: సీఎం
TG: లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేసే పరిస్థితి లేదని సీఎం రేవంత్ అన్నారు. వాళ్ల బండారం బయటపడుతుందని జగిత్యాల సభ పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని తెలిపారు. కేంద్రం విచారణకు ఆదేశిస్తుందన్న భయంతో హరీష్ ఢిల్లీ వెళ్లారని చెప్పారు. ఆయన పర్యటనను ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు.