VIDEO: కూటమి నాయకులపై ఎమ్మెల్యే ఆగ్రహం
W.G: నరసాపురం మండలం కొత్త నవరసపురం గ్రామంలో ఆర్ అండ్ బీ రహదారి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రజలు ఎవరూ రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. దీంతో ఎమ్మెల్యే నాయకర్ స్థానిక కూటమి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.