VIDEO: మార్గమధ్యలో ఆగిపోయిన RTC బస్
KDP: గోపవరం మండలం ద్వారక నగర్ వద్ద బద్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బద్వేల్ నుంచి నెల్లూరుకు బయల్దేరిన 5 కిలోమీటర్ల తర్వాత మధ్యలోనే మొరాయించింది. దీనివల్ల ప్రయాణికులు అరగంట పాటు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. అయితే డిపో నుంచి బస్సులను పంపే ముందు సక్రమంగా తనిఖీ చేస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.