భారీ వర్షాలు.. ఎయిర్ పోర్టులో కూలిన రూఫ్

భారీ వర్షాలు.. ఎయిర్ పోర్టులో కూలిన రూఫ్

భారీ వర్షాలకు రూఫ్ కూలిన ఘటన ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద జరిగింది. దీంతో టెర్మినల్ వద్ద ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, భారీ వర్షాల కారణంగా 17 అంతర్జాతీయ విమానాలతో సహా 49 విమానాలను దారి మళ్లించారు. దాదాపు 200కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.