శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నూతన నిర్మాణానికి విరాళం
అన్నమయ్య: పీలేరు మండలం చిత్తురు రోడ్డులో వెలసిన శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ ఆధునిక కట్టడం కోసం ఆదివారం విరాళం అందినట్లు ఆలయ కమిటీ తెలిపింది. మండలానికి చెందిన ఉపాధ్యాయులు శెట్టి సుబ్రహ్మణ్యం, సద్దల పుష్పలత దంపతులు రూ.లక్ష విరాళంగా అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.