'ట్రైబల్ హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి'

VZM: బీసీ కాలనీలో ఉన్న పోస్ట్ మెట్రిక్ బాయ్స్ ట్రైబల్ హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌వో ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పీడీఎస్‌వో జిల్లా అధ్యక్షులు కె. సోమేశ్వరరావు మాట్లాడుతూ.. హాస్టల్లో విద్యార్థులు వాడుతున్న నీరు వెళ్లడానికి సరైన మార్గం లేదని.. హాస్టల్లో మరుగుదొడ్లు, మంచినీరు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు.