మహిళ హత్య.. దొంగ స్వామీజీ అరెస్టు

సిద్దిపేట: పూజలు చేస్తామని నమ్మించి మహిళను హత్య చేసిన దొంగ స్వామీజీని అరెస్టు చేసినట్లు జిన్నారం సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొంతపల్లికి చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేస్తే మంచి జరుగుతుందని దొంగ స్వామీజీ శివ నమ్మించాడు. ఫిబ్రవరి 13న హత్య చేసి 4.3 తులాల బంగారం దొంగిలించాడు.