'కడపలో విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం'

KDP: రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఆగష్టు 28న నిర్వహించనున్న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినంను జయప్రదం చేయాలని సీపీఎం కడప కార్యదర్శి రామమోహన్ కోరారు. కడప నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో రామ మోహన్ మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లు, ట్రూ ఆప్ చార్జీల రూపంలో ప్రజలపై మోపిన భారాన్ని రద్దు చేయాలని అన్నారు.