సీఎం చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం: మంత్రి
NLR: జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం తెలిపారు. సీఎం 30న నాయుడుపేటలో టిడ్‌కో ఇళ్ల పంపిణీలో పాల్గొంటారని అన్నారు. ఒకటో తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీకి వస్తారని వివరించారు. రెండు పర్యటనలు విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వెల్లడించారు.