'ఎమ్మెల్యే తన అనుచరులతో బెదిరిస్తున్నారు'
PDPL: ఎమ్మెల్యే విజయరమణారావు తన అనుచరులతో ఫోన్ కాల్స్ చేయించి, బెదిరిస్తున్నారని MLA పాడి కౌశిక్ ఇవాళ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంపుల-తనుగుల చెక్ డ్యాం కూల్చివేశారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, వీడియోలు బయటపెట్టినా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే ఫోన్ కాల్స్ చేయిస్తున్నారన్నారు. 60 ఏళ్ల వయసుకే నీకంత ఉంటే, 40 ఏళ్ల వయసులో నాకెంత ఉండాలి? అని కౌశిక్ రెడ్డి విమర్శించారు.