ఆదోనిలో బంద్ సంపూర్ణం
కర్నూలు: ఆదోని జిల్లా కోసం ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. పట్టణంలో దుకాణాలు, బ్యాంకులు, మాల్స్, పెట్రోల్ బంకులు తెరుచుకోలేదు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి బందును విజయవంతం చేశారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఉద్యమంపై కూటమి పెద్దలు స్పందించి జిల్లాను ప్రకటించాలని ప్రజలు కోరారు.