తెలంగాణ జన సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NLG: తెలంగాణ జన సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగేశ్వరరావు టీజేఎస్ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి ఉపాధ్యక్షుడు క్రాంతి కుమార్, డా. నరసింహాచారి, కిరణ్ కుమార్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.