మూడు నెలల రేషన్‌లో తప్పని తిప్పలు..!

మూడు నెలల రేషన్‌లో తప్పని తిప్పలు..!

NLG: జిల్లాలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రహసనంగా మారింది. ఈ-పోస్ సాఫ్ట్‌వేర్ మొరాయిస్తుండటంతో ఒక్కొక్కరికి మూడుసార్లు వేలిముద్ర, మూడుసార్లు తూకం వేయాల్సి వస్తోంది. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయోమెట్రిక్ సమస్యల వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని, సాఫ్ట్‌వేర్ ఇబ్బందులను వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.