గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్

HNK: హసన్‌పర్తి మండలం గుండ్ల సింగారం సమీపంలో గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న యువకుడిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నేడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేయూ సీఐ రవికుమార్ కథనం ప్రకారం దుప్పటి ప్రవీణ్ అనే యువకుడుని అదుపులోకి తీసుకొని మూడు కిలోల గంజాయితో పాటు ద్విచక్ర వాహనం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.