మాదకద్రవ్యాల సరఫరా పడవపై అమెరికా దాడి
తూర్పు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో మాదకద్రవ్యాలతో వెళ్తున్న పడవపై దాడి చేసినట్లు అమెరికా సైన్యానికి చెందిన సదరన్ కమాండ్ వెల్లడించింది. దాడి సమయంలో ఆ పడవలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పింది. అయితే వారు మరణించారా?, గాయపడ్డారా? అనే వివరాలను తెలపలేదు. సముద్రంలో డ్రగ్స్ సరఫరా చేసే పడవలపై అమెరికా కాల్పులు జరుపుతోంది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 157 మంది మృతి చెందారు.