వేంపల్లి ఉర్దూ కాలేజీ కేంద్రంపై ఆరోపణలు
KDP: వేంపల్లిలో జరుగుతున్న ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టాలని ఏఐఎస్‌బీ రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి పరీక్షల్లో కాపీయింగ్ జరగేలా చూస్తున్నాయని ఆరోపించారు. వేంపల్లి ఉర్దూ కాలేజీ కేంద్రంలో కూడా మాస్ కాపీయింగ్ జరుగుతోందని తెలిపారు.