'ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి'

'ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి'

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం హై స్కూల్‌లో స్వచ్ఛ రథం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఇమ్రాన్ విద్యార్థులకు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను వివరించి, పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ప్రోత్సహిస్తూ, పెన్నులు, ప్యాడ్‌లను పంపిణీ చేశారు.