విద్యార్థులతో వెట్టి చాకిరీ పనులు.. వైరల్!
MNCL: విద్యార్థులతో హాస్టల్ వార్డెన్ ఇసుక తట్టలు మోపించిన ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. మంచిర్యాల సాయి కుంటలోని ఓ బాలుర వసతిగృహంలో విద్యార్థులను నిర్మాణ పనులకు వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వార్డెన్‌కు సన్నిహితుడైన వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం ఈ పని చేయించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియోలు SMలో వైరల్ అయ్యాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.