రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని సోమవారం పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.