VIDEO: ముదిగుబ్బ మండలంలో నీటి కష్టాలు

VIDEO: ముదిగుబ్బ మండలంలో నీటి కష్టాలు

సత్యసాయి: ముదిగుబ్బ మండలంలో రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ముదిగుబ్బలో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. నెలకు పైగా నీరు రాకపోవడంతో ట్యాంకర్లతో నీరు కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు. గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని సర్పంచ్‌ లక్ష్మీదేవి తెలిపారు.