భారత్‌కు ఎసెన్స్ కాస్మొటిక్ బ్రాండ్
దేశంలో వేగంగా పెరుగుతున్న బ్యూటీ బిజినెస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా రిలయన్స్ రిటైల్ మరో కీలక అడుగు వేసింది. యూరప్‌లో యూనిట్ల విక్రయాల పరంగా అగ్రగామిగా నిలిచిన కాస్మొటిక్ బ్రాండ్ ఎసెన్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం జర్మనీకి చెందిన గ్లోబల్ కాస్మొటిక్ కంపెనీ కోస్నోవా బ్యూటీతో రిలయన్స్ రిటైల్ జట్టు కట్టింది.