VIDEO: మేఘాలకొండలో వీకెండ్ సందడి
ASR: అరకులోయ మండలంలోని మాడగడ మేఘాలకొండ వద్ద ఆదివారం ఉదయం పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున పాలసముద్రంలా కమ్ముకున్న మేఘాల దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది. వీకెండ్ కావడంతో నలుమూలల నుంచి ప్రజలు కుటుంబసమేతంగా చేరుకుని సహజ సౌందర్యాన్ని ఆస్వాదించారు. పర్యాటకులు భారీగా తరలిరావడంతో అక్కడ ఒక్కసారిగా కిక్కిరిసిన వాతావరణం నెలకొంది.