అర్ధరాత్రి వరకు మీసేవ కేంద్రాలు తెరిచి ఉంటాయి: కలెక్టర్

అర్ధరాత్రి వరకు మీసేవ కేంద్రాలు తెరిచి ఉంటాయి: కలెక్టర్

HNK: ఆర్థిక సంవత్సర ముగింపు నేపథ్యంలో మంగళవారం మార్చి 31 అర్ధరాత్రి వరకు నగరంలోని బల్దియా సేవా కేంద్రాలు పనిచేస్తాయని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆస్తి పన్ను, నీటి పన్నుతో పాటు ఇతర బకాయిలను సమయానికి చెల్లించాలని సూచించారు. పన్నుల చెల్లింపులో ప్రజల భాగస్వామ్యం నగర అభివృద్ధికి కీలకమని ఆయన పేర్కొన్నారు.