బాపట్లలో ఘనంగా పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ
BPT: బాపట్ల పట్టణంలోని త్రవ్వకాలువ వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుతో కలిసి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాలను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు.