ప్రజావాణి ఫిర్యాదుదారులకు చేదోడు వాదోడుగా సీనియర్ సిటిజన్ ఫోరం

MBNR: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. చదువుకున్న వారు ఫిర్యాదులను వారే రాసుకుని తీసుకువస్తారు. కానీ, చదువు రాని వారి కోసం సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా ఫిర్యాదులను రాసిస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.