డివైడర్‌ను ఢీకొన్న లారీ
BDK: భద్రాచలం పట్టణంలో నిన్న రాత్రి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం వల్ల ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.