రామాపురంలో వైద్య శిబిరం

రామాపురంలో వైద్య శిబిరం

అన్నమయ్య: చిట్వేల్ మండలం రామాపురంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యూ.సల్మా ఆదేశాల మేరకు బీపీ, మధుమేహ పరీక్షలు చేశారు. చిన్నపాటి సమస్యలకు మందులు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి నిల్వ నీటి ప్రదేశాలను పరిశీలించి దోమల లార్వా నిర్మూలన చేపట్టారు. పరిశుభ్రత పాటించాలని సిబ్బంది సూచించారు.