'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కాంటాలు ప్రారంభించాలి'
SRPT: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేయాలని సీపీఎం రాష్ట్ర సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తిలో నిర్వహించిన మండల కాండ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.20వేల నష్టపరిహారం అందించాలన్నారు.