మేనత్త పై అల్లుడు కత్తితో దాడి

NTR: పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకుని పాలెంలో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకుంది. మేనత్త మరియమ్మపై అల్లుడు నరేంద్ర కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతుండటంతో ఆమెను స్థానికులు 108 వాహనంలో విజయవాడకు తరలించారు. ప్రస్తుతం మరియమ్మ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు చేశారు. దాడికి కారణాలు ఇంకా తెలియాల్సిఉంది.