కార్యకర్తలను కాపాడుకుంటా: మాజీమంత్రి

WNP: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గోపాల్‌పేట మండలం తాడిపర్తికి చెందిన పార్టీ కార్యకర్త రవీంద్ర ఇటీవల ప్రమాదంలో మృతి చెందారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ఇవాళ నిరంజన్ రెడ్డి పరామర్శించి, పార్టీ నుంచి మంజూరైన బీమా చెక్కును మృతుని భార్య అంజలికి అందజేశారు.