ఉద్యోగులకు 80 శాతం బోనస్ ప్రకటన

ఉద్యోగులకు 80 శాతం బోనస్ ప్రకటన

ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) వారి పనితీరుకు గాను సగటున 80 శాతం బోనస్‌ను ప్రకటించింది. దీన్ని ఆగస్టు నెల జీతంతో కలిపి చెల్లిస్తారు. గత త్రైమాసికంలో ఇచ్చిన 65 శాతం బోనస్‌తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. సంస్థ బలమైన ఆర్థిక ఫలితాలు, పెద్ద డీల్స్ సాధించడమే దీనికి కారణమని తెలుస్తోంది.