VIDEO: రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

CTR: పుంగనూరు మండలం జగనన్న కాలనీ మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యుత్ పనులు చేస్తున్నవారు, ఒక యువకుడు గాయపడ్డారు. హైవే అంబులెన్స్ సిబ్బంది గాయపడిన మణికుమార్ (30), వెంకటేష్ (14), అనంత కుమార్ (30), చంద్ర (30)లను పుంగనూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.